calender_icon.png 12 January, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ప్రజారక్షణలో హోంగార్డుల పాత్ర అత్యంత కీలకం..!

06-12-2024 11:04:35 PM

62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్...      

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రజారక్షణ కోసం పనిచేస్తున్న పోలీసు అధికారుల్లో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్నది హోంగార్డులేనని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు. శుక్రవారం 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీసు పెరేడ్ మైదానంలో హోంగార్డుల చేత పెరేడ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేదికపై మాట్లాడుతూ.. ప్రజారక్షణలో భాగంగా పోలీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత, ప్రజారక్షణ కోసం 1946 డిసెంబర్ 6న హోంగార్డు వ్యవస్థను తీసుకొచ్చారని అప్పటీ నుండి ప్రతి సంవత్సరం మన పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డు రేసింగ్ డే గా సెలబ్రేట్ చేస్తున్నామన్నారు.

హోంగార్డుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని మిగతా జిల్లా స్థాయి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అనంతరం వారి సమస్యలను వినేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసి అక్కడ వినతులను స్వీకరించారు. వారితో పాటు ఆర్ఐ జగన్, సీఐ కనకయ్య గౌడ్,  ఆర్ఎస్ఐలు ప్రశాంత్ కళ్యాణ్,  శివాజీ, హోంగార్డ్ అధ్యక్షుడు జమ్ములు, వైస్ ప్రెసిడెంట్ రాజమల్లు ఉన్నారు.