calender_icon.png 5 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ ల పాత్ర కీలకం

02-01-2025 05:02:05 PM

ఆర్టీసీ ఆర్ఎం సొలొమాన్... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర చాలా కీలకమని ఆదిలాబాద్ ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్ సొలొమాన్ అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా జాత బృందం సభ్యులు పాటల రూపంలో రోడ్డు భద్రతపై ప్రయాణికులకు వివరించారు. ఈ మేరకు ఆర్.ఎం మాట్లాడుతూ... ఆర్టీసీ బస్సులో ప్రయాణం ప్రయాణికులకు ఎంతో సురక్షితం అని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ అనేక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రయాణికులకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ పోతరెడ్డి, ట్రాఫిక్ సూపర్వైజర్ పోశెట్టి, ఆయిల్ డి.సి వందన తదితరులు ఉన్నారు.