21-04-2025 01:05:05 AM
వారితోనే కార్పొరేట్ రంగానికి కొత్తరూపు
గ్లోబల్ ఎకనమిక్ పవర్‌గా భారత్ ఇంటలెక్చువల్ కోసం మనవైపు ప్రపంచం చూపు
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కంపెనీ సెక్రటరీ(సీఎస్)లు దేశ కార్పొరేట్ రంగానికి కొత్త రూపురేఖలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జీ కిషన్‌రెడ్డి ప్రశంసించారు. కార్పొరేట్ కంపెనీలు విలువ లను పాటిస్తూ, పారదర్శకంగా చట్టాలను అనుసరించేలా చేస్తూ.. దేశ కార్పొరేట్ వ్యవహారాలకు వెన్నెముకలా నిలిచారని కితాబునిచ్చారు.
ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ (ఇస్కి) హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి ఆదివారం కేంద్రమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కంపెనీల సమగ్రత కాపాడటంతోపాటు కార్పొరేట్ వ్యవహారాల నిర్వహణ సరిగా ఉండేలా చూ స్తూ, దేశ ఆర్థిక వృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 2017లో జరిగిన ఇస్కి జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారన్నారు.
దేశంలో కార్పొరేట్ సంస్కృతిని పెంపొందించడంతోపాటు దేశీయ వ్యాపారంపై నమ్మకం కలిగేలా చేశారని ప్రధాని ప్రశంసించారని గుర్తుచేశారు. ఈ నమ్మకంతోనే దేశ, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తు న్నారని తెలిపారు. అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్‌గా వడివడిగా ముందుకు సాగుతోందన్నారు. సత్యం వధ ధర్మం చెర.. అనే సూత్రం ఆధారంగా ఇస్కి పనిచేస్తోందన్నారు.
ప్రతీ కంపెనీ సెక్రటరీ నిత్యం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తే దేశ వ్యాపార రంగం పారదర్శకతతో ముందుకు సాగుతుందని చెప్పారు. ఇప్పటికే దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ఈ విజ యం అంకితభావం ఉన్న కంపెనీ సెక్రటరీల ప్రొఫెషనల్స్ హార్డ్ వర్క్‌తోనే సాధ్యమైందన్నారు.
ఇప్పటికే జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మన టాలెంట్‌ని గుర్తించి కంపెనీ సెక్రటరీలు, లాయర్లు, అకౌంటెంట్లను వా రి దేశాల్లో పనిచేసేందుకు నియమించుకుంటున్నాయని తెలిపారు. ఇంట లెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. ఇంటలెక్చువల్, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకో వడం అంటే కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదని.. సమాజం తోపాటు ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందన్న విషయాన్ని గుర్తుం చుకోవాలన్నారు.
భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా ఇస్కి లాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నామన్నారు. 2047 నాటికి దేశం వికసిత భారత్‌గా ఎదిగేందు కు.. భారత్‌తో పాటు ప్రపంచ దేశా ల్లో వ్యాపార రంగం అభివృద్ధి చెం దేందుకు.. కంపెనీ సెక్రటరీల నైపు ణ్యం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు.