calender_icon.png 24 December, 2024 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివిధ రంగాల్లో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకం

19-10-2024 02:50:54 AM

  1. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  2. హైదరాబాద్‌లో ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీల సదస్సు

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): అభివృద్ధి చెందుతున్న రంగాల్లో కంపెనీ సెక్రటరీల కీలకమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రస్తుతం వారికి ఆయా రంగాల్లో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం, దివాలా, వాల్యుయేషన్, ఫోరెన్సిక్ ఆడిట్ , రిస్క్ మేనేజ్‌మెంట్‌తోపాటు అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలో కంపెనీ సెక్రటరీలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాని పేర్కొన్నారు.

వృత్తిలోకి ప్రవేశించే యువ నిపుణులు తప్పనిసరిగా అప్‌డేట్‌గా ఉంటూ, ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో “ఇండెల్జెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్’ అనే థీమ్‌తో రెండు రోజులపాటు జరిగే ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీల 16వ దక్షిణ భారత ప్రాంతీయ సదస్సును  శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతికి ఇంటెలిజెన్స్ కీలక చోదకమన్నారు. సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కంపెనీల సెక్రటరీలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మారిటైమ్ లా, క్యాపిటల్ మార్కెట్స్ వంటి స్పెషలైజేషన్‌లలో స్పెషలిస్ట్ కంపెనీ సెక్రటరీలకు శిక్షణ ఇవ్వడం, ఇందులో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు ఫీజు మినహాయింపులు అందించడం గొప్ప విషయమన్నారు.

కంపెనీ సెక్రటరీల ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఎగ్జామినేషన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కృష్ణ అగర్వాల్‌కు అవార్డును గవర్నర్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐసీఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు నరసింహన్, ఐసీఎస్‌ఐ వీపీ ధనంజయ్ శుక్లా, 200 మందికి పైగా కంపెనీ కార్యదర్శులు పాల్గొన్నారు.