calender_icon.png 20 April, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యం

19-04-2025 10:58:29 PM

బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యం అని బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు. బాచుపల్లి లోని ప్రణీత్ ఆంటీల్యాకమ్యూనిటీస్ లో స్థానిక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలను శనివారం డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస్ రావు, బాచుపల్లి ఎస్ హెచ్ ఓ ఉపేందర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి కాలనీ అసోసియేషన్ సభ్యులు కూడా సోషల్ రెస్పాన్స్ గా ఉంటూ వారి వారి కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాలను అరికట్టెందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కాలనీ అసోసియేషన్ నేతలు, పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.