calender_icon.png 15 January, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏల పాత్ర కీలకం

07-07-2024 12:04:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏలది కీలక పాత్ర అని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సీఏ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహా ఇతర సాంకేతికతను ఉపయోగించి దేశంలోని ప్రధాన నగరాలను గ్లోబల్ అకౌంట్స్ ప్రాసెసింగ్ హబ్‌లుగా మార్చాలని సూచించారు. ఉన్నతమైన ప్రమాణాలు, కఠినమైన ఆడిటింగ్ పద్ధతులను అవలంభించడం వల్ల అవినీతి, మోసాలను నిరోధించ వచ్చని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో సాధించిన ఇంజినీరింగ్, ఆర్థికంగా సాధించిన ప్రగతిని వివరించారు. ప్రపంచస్థాయి అకౌంటింగ్ సంస్థలను సృష్టించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, సీఏ జే స్నేహజ, సీఏ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దేవరాజ రెడ్డి, సీఏ విజయ్‌కుమార్, సీఏ లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.