05-03-2025 12:24:16 AM
జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ
మేడ్చల్, మార్చి ౪ (విజయక్రాంతి): మహిళల ఆరోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్ల పాత్ర కీలకమని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ సి ఉమా గౌరీ అన్నారు. ఆశ డే సందర్భంగా మల్కాజిగిరి, బాలానగర్ లలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తల్లి శిశు ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని, పోషకాహారం, ఐరన్ సప్లిమెంటేషన్, అనీమియా నివారణ పై అవగాహన కల్పించాల న్నారు. ఇంటర్, ఎస్‌ఎస్సి పరీక్షల సందర్భంగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏఎన్‌ఎమ్ లు, ఆశ వర్కర్లు చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు.