13-02-2025 07:25:34 PM
ఎమ్మెల్సీ దండే విఠల్...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల పాత్ర కీలకమని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. దహేగం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయ్యాలన్నారు.
రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని తెలిపారు. కొందరు రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తారని వారిని పట్టించుకోవద్దని అభివృద్ధిపై దృష్టి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిడం గణపతి, మాజీ జడ్పీటీసీ సభ్యులు రామారావు, చింతలమానపల్లి మాజీ ఎంపీపీ డబ్బుల నానయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు గజ్జల జయలక్ష్మి సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.