27-04-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 26 (విజయ క్రాంతి): మేడ్చల్ మండలంలోని గ్రామాలలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లు జలమయం కావడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపైన ఎక్కడ గుంతలు ఉన్నాయో అనే విషయం తెలియక ద్విచక్ర వాహనాలు అదుపుతప్పాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలం వస్తే రోడ్ల పరిస్థితి ఏంటో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకొని రోడ్లను బాగు చేయించాలని కోరుతున్నారు.