ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శనివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రాష్ర్ట వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు, బూత్‌స్థాయి అధికారులకు అవార్డులను అందజేశారు. సీఈఓ సుదర్శన్ రెడ్డి, రాష్ర్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, అడిషనల్ సీఈవో లోకేష్ కుమా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఇలంబర్తి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులు పాల్గొన్నారు.