జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, జనవరి 25: ప్రజాస్వామ్యములో ఓటు హక్కు వజ్రాయుధమని, 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారము వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 75 వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురష్కరించుకొని ర్యాలి నిర్వహించారు.
జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా జిల్లా అధికారులు, విద్యార్తులు ఓటర్ల అందరిచే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 15 వ జాతీయ ఓటరు దినోత్సవము సందర్బంగా సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన సమావేశములో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అందరు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని, ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహనా కలిపించికోవాలని కలెక్టర్ సూచించారు.
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ లింగ్యా నాయక్, సుదీర్ డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా స్వీప్ అధికారి సత్తార్ , ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ అలీ , అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.