calender_icon.png 16 April, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ కృషితోనే ఓటు హక్కు

15-04-2025 12:00:00 AM

కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): భారతరత్న డా.బీఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశంలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే మురళీ ధర్‌రెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నివాళులర్పించి, మాట్లాడారు. -బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు ఎంతో కీలకమని, ముఖ్యంగా బహుజన వర్గాలకు రిజర్వేషన్లు జీవితాల్లో మెరుగైన మార్పును తీసుకొ స్తాయన్నారు. ఈ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో 42శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించడం ప్రశంసనీయమని  మురళీధర్‌రెడ్డి తెలిపారు.