09-04-2025 02:27:07 AM
కలెక్టర్‌తో కలిసి, మహిళ ఇంట్లో సహా పంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి) : పేద, దళిత అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్నీ తీసుకొచ్చిందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు భువనగిరి పట్టణం లోని తారక రామ్‌నగర్‌లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి పుష్పలత నివాసం లో సన్న బియ్యం భోజనం చేశారు.
ఈ సందర్భంగా భువనగిరి శాసన సభ్యులు మాట్లాడుతూ పేద వారు సంతోషంగా కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలోని ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో మొదటి సారిగా ప్రారంభించారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..పేద కుటుంబం అయిన పుష్పలత ఇంట్లో భువనగిరి శాసన సభ్యులతో కలిసి భోజనం చేయడం జరిగిందన్నారు. జడ్పీ సీఈఓ శోభారాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీనివాస్, సివిల్ సప్లై అధికారి వనజాత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.