calender_icon.png 21 April, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం పథకం

11-04-2025 12:33:02 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

కడ్తాల్, ఏప్రిల్ 10 : పేదల ఆకలి తీర్చేందుకే  రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం కడ్తాల్  మండలంలోని కొండ్రి గాని  గాని బోడు తండాలో సన్న బియ్యం లబ్ధిదారులు టక్రు నాయక్ ఇంట్లో అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే  భోజనం చేశారు.

అంతకు ముందు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభు త్వం ఇటీవల అందించిన  సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటోలో భోజనం చేశారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని  పేదల కడుపు నిండా తినాలనదే ప్రభుత్వ నిర్ణయం అన్నారు. 

గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, తహశీల్ధార్ ముంతాజ్ బేగం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యా నాయక్, నాయకులు చేగూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.