11-04-2025 12:46:43 AM
లబ్దిదారుని ఇంట్లో సహపంక్తి భోజనం
33/11 కెవి నూతన సబేస్టేషన్ ప్రారంభం
మెదక్, ఏప్రిల్ 10(విజయక్రాంతి):రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో మొదటి సారిగా ప్రారంభించారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. గురువారం మెదక్ మండలం బాలానగర్ గ్రామంలో లబ్దిదారుడు కట్రోత్ శివ ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం 33/11 కెవి సబ్స్టేషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. పేద, ధనిక అనే బేధాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల కోసం పరితపించే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని ఉద్దేశ్యంతో వున్నారని తెలిపారు.
నిరంతర విద్యుత్ సరఫరా అందించడం ధ్యేయంగా పటిష్ట ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నామని చెప్పారు. అందులో భాగంగానే నూతన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శంకర్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.