calender_icon.png 26 April, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లులకు వచ్చిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దింపుకోవాలి

26-04-2025 12:14:35 AM

అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు

వనపర్తి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) :  మిల్లులకు వచ్చిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు దింపుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం ఘనపూర్ మండలంలోని సోలీపూర్ గ్రామ సింధు ట్రేడర్ ను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొనుగోలు కేంద్రం నుండి పంపించిన వరి  ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు దించుకొని ట్రక్ షీట్ పై సంతకం చేసి  పంపించాలని సూచించారు.అదేవిధంగా వ చ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సకాలంలో ఎఫ్. సి.ఐ. కి పాటించాలని సూచించారు. అనంతరం చిట్యాల మార్కెట్ యార్డు గోదాములు సందర్శించారు. గోదాములకు వస్తు న్న ధాన్యం త్వరగా దించుకొని లారీలను పోయించాలని ఆదేశించారు.