calender_icon.png 23 November, 2024 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకుల మాటతీరు మారాలి

22-11-2024 12:00:00 AM

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధికార, ప్రతిపక్ష నాయకులు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి. చాలామంది ఉపయోగించే భాష ఆందోళనకరంగా ఉంటున్నది. సభ్యసమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాడకూడని పదాలు వాడడం పెద్దతనం అనిపించుకోదు. అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే విలేకరుల సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, ఊరేగింపులు, అభివృద్ధి, ఆందోళన కార్యక్రమాలలో వాడుతున్న భాష సభ్యసమాజం తల దించుకునేలా ఉంది.

‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో పలువురు వ్యవహరిస్తున్నారు. కొందరైతే మరీ దిగజారి మహిళలపై అనుచిత వ్యాఖ్యలూ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అలాంటి నాయకులపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. దైర్యం చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసా గించాలనుకుంటే తమ పలుకుబడిని ఉపయోగించి కేసులు నమో దు కాకుండా చూసుకుంటున్నారు.

కేసులు నమోదైనా కోర్టులద్వారా బెయిల్ మంజూరు చేసుకుంటున్నారు. తర్వాత షరా మా మూలే. బూతు మాటలు మాట్లాడితేనే నాయకులమనే భ్రమలో వారంతా ఉండడం విచారకరం. ఇక, ఎన్నికల్లో ఓడిపోయిన వారు చేసిన తప్పులను సరిచేసుకోకుండా ప్రజలే తప్పు చేశారని, తమను గెలిపిస్తే సమస్యలే ఉండేవి కావని అనడం మరింత హాస్యాస్పదం.

ప్రజలు తమ పరిపాలనతోనే విసిగి కొత్త నాయకులను ఎన్నుకున్నారనే సత్యాన్ని వారు గుర్తించకపోతే ఎలా? క్షేత్రస్థాయిలో ప్రజల ను ఏనాడూ కలవని నాయకులు ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం శూన్యం. సోష ల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు క్షమార్హం కాదు.  

 డా. ఎస్. విజయభాస్కర్, హైదరాబాద్