సూర్యాపేట, ఫిబ్రవరి 5 : విప్లవ సాంస్కృతికోద్యమంను మరింత తీవ్రతరం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన రెండు అరుణోదయ సంస్థల విలీన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అరుణోదయ కోసం అహర్నిశలు కృషి చేసిన కానూరి వెంకటేశ్వరరావు, అరుణోదయ రామారావు, వై వెంకన్నలు చూపిన బాటలో ముందుకు సాగాలన్నారు.
దేశంలో పెను ప్రమాదంగా ముందుకొస్తున్న కషాయికరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా పాత వ్యవసాయ మార్కెట్ నుండి శంకర్ విలాస్ మీదగా కొత్త బస్ స్టాప్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తిరుమల గ్రాండ్ వద్ద అరుణోదయ జండాను రాష్ట్ర అధ్యక్షులు పి నాగన్న ఆవిష్కరణ చేశారు.
ఈ విలీన సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే గోవర్ధన్, ఆవునూరి మధు సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, రాయి కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం, ఉదయగిరి, IFTU జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి, తదితరులు పాల్గొన్నారు