19-03-2025 02:10:05 AM
జిల్లాకోర్టుకు రివ్యూ చేసే అధికారం ఉంది: హైకోర్టు
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై సామాజిక కార్యకర్త రాజలింగమూ ర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారించిన హైకోర్టు పిటి షనర్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ విచారణకు అర్హమేనని స్పష్టం చేసింది. కేసీఆర్, హరీశ్‌రావుకు ఇచి ్చన నోటీసులపై కింది కోర్టు ఇచ్చిన వ్యాఖ్యలను రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
బరాజ్ కుంగుబాటుకు నాసిరకంగా పనులు చేపట్టడ మే కారణమంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి (లేటు) భూపాలపల్లి లోయర్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటషన్‌ను కింది కొట్టివేయడంతో పిటిషనర్ తిరిగి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన జిల్లా కోర్టు గతంలో కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు మరో నలుగురికి నోటీసులను జారీ చేసింది.
వీటిని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. రివిజన్ పిటషన్ విచారణార్హమేనని, మేజిస్ట్రేట్ ఉత్తర్వులుపై రివ్యూ చేసే పరిధి, అధికారం జిల్లా కోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది. జిల్లాకోర్టుకు అధికారం లేదనే కేసీఆర్, హరీశ్‌రావు వాదనను తోసిపుచ్చింది.