calender_icon.png 6 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి

04-03-2025 12:00:00 AM

కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 3 (విజయక్రాంతి) ః జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయిలో పెండింగ్లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిపై అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదన కలెక్టర్ విద్యాచందన , పంచాయతీ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్  నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అన్నారు. అవసరమైన చోట అదనపు లాగిన్ల ద్వారా అధికారులు సమన్వయంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ 

కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా సోమవారం ఈవీఎం గోడౌన్ ను సందర్శించడం జరిగిందని తెలిపారు.

ఈ పరిశీలనలో భాగంగా  ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపర్డెంట్  ధారా ప్రసాద్, తాసిల్దార్ పుల్లయ్య, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.