calender_icon.png 4 October, 2024 | 1:00 PM

కమిటీ నిర్ణయం తరువాతే ఫలితాలు

04-10-2024 01:57:27 AM

మెయిన్స్ సమయంలో కోర్టుల జోక్యం సరికాదు

హైకోర్టులో గ్రూప్--1 నోటిఫికేషన్‌పై టీజీపీఎస్సీ

హైదరాబాద్ , అక్టోబర్ 3 (విజయక్రాంతి): గ్రూప్--1 పరీక్షలకు చెందిన కీపై అ భ్యంతరాలు స్వీకరించామని, వీటిని ఆయా సబ్జెక్ట్‌ల వారీగా నిపుణుల కమిటీకి పంపి వారు అమోదించిన తరువాతే ఫలితాలు విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ గురువారం హైకోర్టుకు నివే దించింది. త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నందున ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.

గ్రూప్--1 పోస్టుల భర్తీకి 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుం డా మరో నోటిఫికేషన్ వేయటం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులను సవరించాలన్న అభ్యర్థలను టీజీపీఎస్సీ పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు.

పరీక్షల నిర్వహణకు ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం కమిషన్‌కు ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పు అయినట్లు కాదని వాదించారు. పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. వాదనలు పూర్తికాకపోవడం తో న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.