ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్....
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీల ఎగుమతి దిగుమతి ధరల పెంపు పోరాటాలతోనే సాధ్యమైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ అన్నారు. గురువారం కాగజ్ నగర్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ధరల పెంపుకు సంబంధించిన జీవో విడుదలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏఐటీయూసీ పోరాటం చేయడంతోనే ప్రభుత్వం స్పందించి హమాలి రేట్లను పెంచిందన్నారు. కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ పోరాటం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. బకాయిలను వెంటనే విడుదల చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెట్ల పెంపుపై కార్మికులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సమావేశంలో హమాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ నాయకులు అంజి, రాజు, సుధాకర్, నవీన్, సురేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.