17-04-2025 12:38:38 AM
ఖమ్మం, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ప్రజాహక్కుల పరిరక్షణ కమ్యూనిస్టుల బాధ్యత అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మధురైలో ఇటీవల జరిగిన పార్టీ 24వ ఆలిండి యా మహాసభల్లో ఆహారం, ఇల్లు, ఉపా ధి, విద్యా, ఆరోగ్యం, పింఛన్లను దేశంలోని ప్రతి పౌరుని హక్కులుగా చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ తీర్మానాల అమలుకు ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ హక్కుల సాధనే పార్టీ జాతీయ మహాసభలకు ప్రతినిధిగా హాజరై, మృతి చెందిన యర్రా శ్రీకాంత్ కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఖమ్మంలోని త్రీటౌన్ బోస్ బొమ్మ సెంటర్లో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభకు బీవీ రాఘవులు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ట్రంప్ నిర్ణయాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు. ప్రపంచ దేశాలకు 125 శాతానికి పైగా వాణిజ్యసుంకాన్ని మోపేందుకు సిద్దమయ్యాడన్నారు. గ్రీన్ కార్డులు, హెచ్1బీ వీసాలనూ రద్దు చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్చావాణి జ్యంపై ఆంక్ష లు తెస్తున్నట్లు చెప్పారు.
పార్టీ ఆలిండియా మహాసభల్లో ఇద్దరు కామ్రేడ్స్ గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. వీరిలో ఒక్కరు కేరళ మాజీ మంత్రి మణి.. ఆయన కోలుకున్నారని గుర్తు చేశారు. కానీ , యర్రా శ్రీకాంత్ మృతి చెందటం బాధాకరమన్నా రు. శ్రీకాంత్ మృతి పార్టీకి, ఆయన కు టుంబానికి తీరని లోటని నివాళి అర్పించారు.
లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ మే 20న సమ్మె
నాలుగు లేబర్ కోడ్ లను మే నెల నుంచి అమలు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటిస్తున్న నేపథ్యంలో వచ్చేనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. ఈ కోడ్ లు అమలైతే కార్మికులు తమ బెనిఫిట్స్ అన్నింటినీ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్, బస్తర్ ప్రాం తాల్లో మావోయిస్టుల పేరుతో గిరిజనులను హతమారుస్తున్నారని ఆరోపించారు. మం త్రి పదవి ఇవ్వకపోతే సంగతి చూస్తామని సీఎంను హెచ్చరించే స్థితి రాష్ట్రంలో వచ్చిందనీ, గీత దాటితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారంటే గీత దాటే పరిస్థితులు వచ్చినట్టేగా అన్నారు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు కావట్లేదన్నారు.
అసమానతలపై ఉద్యమాలు: జాన్ వెస్లీ
దోపిడీ, అసమానతలను రూపుమాపటమే కర్తవ్యంగా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. శాస్త్రీయ భావాలు పెం పొందుతున్న తరుణంలో మనువాద ధోరణులు, మూఢవిశ్వాసాలను పెంపొందించే శక్తులు పుట్టుకొస్తున్నాయన్నారు. అసమానతలు లేని సమాజం కోసం పోరాడాల్సిన దశలో అందరితో కలిసిపోయి ప్రజా మన్ననలు పొందిన నాయకుడు శ్రీకాంత్ దూ రం కావలం నష్టదాయకం అన్నారు.
ఈ సంస్మరణ సభలో పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, తెలంగాణ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, బండారు రవికుమార్, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ, మేయర్ నీరజ, డాక్టర్ యలమందలి రవీంద్రనాథ్, జీవీ మాల్ అధినేత గుర్రం ఉమామహేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మెంతుల. శ్రీశైలం, చిన్నికృష్ణారావు, కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, మాచర్ల భారతి, బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.