వినేశ్ కేసులో కాస్ తీర్పు
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు అప్పీల్‌ను తిరస్కరించిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) సోమవారం 28 పేజీల తీర్పును వెలువరించింది. బరువు విషయంలో రెజ్లర్లదే బాధ్యతని కాస్ పేర్కొంది. ‘బరువు విషయంలో ఎవరికి మినహాయింపు లేదు. ఒలింపిక్స్‌లో రూల్ ప్రకారం ఒక రెజ్లర్ బరువును ఫైనల్‌కు ముందు రెండు రోజులు చెక్ చేస్తారు . ఆ సమయంలో తమ బరువును అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత రెజ్లర్లదే.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ఇత ర టోర్నీల్లో రెజ్లర్లకు 2 కేజీల మినహాయింపు ఉంటుంది. కానీ ఒలింపిక్స్‌లో ఆ అవకాశం లేదు. వినేశ్ 50 కేజీల విభాగానికి మారింది. కానీ ఫైనల్‌కు ముందు బరువును నియంత్రించుకోవడంలో విఫలమైంది. ఈ కారణం గానే ఆమెపై అనర్హత వేటు పడింది. కాగా వినేశ్ విషయంలో నిబంధనలకు లోబడే తీర్పును ఇచ్చాం’ అని కాస్ తెలిపింది.