08-04-2025 08:24:30 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 300 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయగా మిగిలిన 41 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రజల సమక్షంలో అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కోరుతూ మంగళవారం నాడు ఎల్లారెడ్డి ఆర్డిఓ మన్నె ప్రభాకర్ కు బిఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సోమర్పేట్ శివారులో నిర్మించిన 300 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 259 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వార్డుల వారీగా సభలు ఏర్పాటు చేసి పారదర్శకంగా అర్హులైన వారిని డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసి నిజమైన అర్హుల నివేదిక సిద్ధం చేశామని పేర్కొన్నారు.
ప్రస్తుతం మిగిలి ఉన్న 41 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని కొంతమంది నాయకులు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇండ్లు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేస్తున్నారని, ఎలాంటి అవకతవకలు జరగకుండా స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో సభను ఏర్పాటు చేసి బహిరంగంగా అర్హులైన వారిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు సతీష్, మండల అధ్యక్షులు జలంధర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ నర్సింలు, మాజీ కౌన్సిలర్ ఎరకుల సాయిలు, డైరెక్టర్ నారాయణ, దేవదాస్, పౌలు, నాయకులు శ్రావణ్, ఇమ్రాన్, వసంతం, పాషా, గంగారెడ్డి, అరవింద్, బర్కత్, బబ్లు, దయాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.