calender_icon.png 2 April, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్విరామంగా తవ్వకాలు 27 రోజులుగా ఎదురుచూపులే

21-03-2025 12:53:00 AM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 

నాగర్ కర్నూల్, మార్చి 20 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు సొరంగమా  కార్మికుల జాడ కోసం నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటన జరిగి 27 రోజులు కావస్తున్నా కార్మికుల జాడ కానరాక బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. ప్రమాద స్థలి వద్ద డీ 1, డీ 2 ప్రాంతాల్లో పూర్తిగా తవ్వకాలు జరిపినా కార్మికుల జాడ లభించలేదు.

అత్యంత డేంజర్ ప్రదేశంలో సింగరేణి రె  బృందాలు కలప దుంగల సా   ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి సహాయక చర్య  చేపడుతున్నారు. కేరళకు చెందిన కడవర్ డాగ్స్ సహాయంతో రోజూ సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతోంది. ప్రస్తుతం 13.6 కిలో  నుంచి ఎస్కలేటర్ జేసీబీ ద్వారా మధ్యలో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్కో షిఫ్ట్‌లో సుమారు 100 మంది చొప్పున గురువారం 14 సహాయక బృందాలు ఆపరేషన్‌ను కొనసాగించాయి. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటికి తరలిస్తున్నారు.

డీ 1, డీ 2 ప్రదేశంలో తవ్వకాలకు ఆటంకంగా ఉన్న టీబీఎం యంత్రాన్ని ఇండియన్ రైల్వే సహాయక బృందాలు ప్లాస్మా థర్మల్ గ్యాస్ కట్టర్ల ద్వారా లోకో ట్రైన్ సాయంతో బయటకు తీశారు. కానీ సాంకేతిక కారణాలతో రో  యంత్రాలు అడుగు ముందుకు వేయకపోవడంతో రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌కు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రాణ నష్టం జరగకుండా సింగరేణి, రాట్ హోల్ మైనర్స్ ద్వారా 14వ కిలోమీటర్ వరకు సహాయక బృందాలు చేరగలిగాయి. అయినా కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో చివరగా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసిన డేంజర్ జోన్ ప్రాంతంలో తవ్వకాలు జరపాల్సి ఉందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.