calender_icon.png 15 January, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జనక అయితే గనక’ విడుదల వాయిదా

05-09-2024 12:00:00 AM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వాటి వల్ల ఏర్పడ్డ వరదలు, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ’జనక అయితే గనక’ విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న  సినిమా ’జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సంగీర్తన హీరోయిన్‌గా నటించారు.సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కావాల్సింది.

అయితే వర్షాలు, వరదల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ”సెప్టెంబర్ 7న ’జనక అయితే గనక’ సినిమాతో మీ అందరి ముందుకొద్దామని అనుకున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వాటి వల్ల ఏర్పడ్డ వరదలు, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ’జనక అయితే గనక’ విడుదలను వాయిదా వేస్తున్నాం” అని అన్నారు.

సుహాస్ మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మా నిర్మాత సినిమా విడుదలను వాయిదా వేశారు. మూవీ ఫైనల్ వెర్షన్ చూశాను. చాలా బాగా నచ్చింది. రాజుగారు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం.” అని అన్నారు.