calender_icon.png 2 April, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండానే

26-03-2025 12:27:17 AM

 పార్టీ నిర్మాణానికి పునరంకిత మవుదాం 

 సీపీఐ వందేళ్ళ వార్షికోత్సవాలలో చాడ పిలుపు 

 చేర్యాల,మార్చి 25 : నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూ, ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీలేనని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేర్యాల పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి అంగడి బజార్ వరకు సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం షాది ఖానా ఫంక్షన్ హాల్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలేనే పార్టీ ఎజెండాగా చేసుకుని రాటాలను కొనసాగిస్తుందన్నారు. త్యాగాల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ నేని అన్నారు. 100 సంవత్సరాల నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాడి నిలిచిందన్నారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు పుట్టగొడుగుల వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన, భూ సంస్కరణలను అమలు, ఉపాధి హామీపథకం, సమాచార హక్కు చట్టం లాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సిపిఐ సహకారంతోనే అమలయ్యాయి అన్నారు. సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు ఎర్రజెండా ప్రజల కోసమే జీవిస్తూ ఉంటుందన్నారు. గ్రామ గ్రామాన పార్టీ నిర్మాణానికి పునరంకితం అవుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి, ఐక్య ఉద్యమాలే శరణ్యం అన్నారు. దేశానికి మతోన్మాద ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు బలమైన ఉద్యమ పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మందపవన్, జనగామ ఎమ్మెల్యే రాజిరెడ్డి, సిపిఐ నాయకులు బట్టు దయానంద రెడ్డి, అంది అశోక్, కత్తుల భాస్కర్ రెడ్డి, జరిపోతుల జనార్ధన్, ఈరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.