- మరో దఫా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు నిర్ణయం
- నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు
- నేడు, రేపు డీఎస్సీ-2024 అభ్యర్థులకు మరోసారి వెరిఫికేషన్
- ఇప్పటికే రెండు సార్లు పరిశీలన
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ కథ మళ్లీ మొదటికొచ్చింది. టీచర్ పోస్టుల భర్తీకి గతేడాదిలో నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగా ల భర్తీలో తప్పిదాలు జరిగినట్టు వార్తలొస్తున్నాయి.
పలువురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టు అధికారులకు ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఇప్పటికే రెండుసార్లు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించగా, తాజాగా మరో ద ఫా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను రంగం సిద్ధమైంది. శుక్రవారం, శనివారాల్లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు మరోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు అధికారులకు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పోర్ట్స్ పోస్టుల భర్తీ కథ మళ్లీ మొదటికొచ్చింది.
మొదటిసారి స్పోర్ట్స్ కోటా
టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలుచేశారు. ఈ కోటా లో 95 పోస్టులుండగా, ఈ క్యాటగిరిలో ఉ ద్యోగాల కోసం దాదాపు 8 వేల మంది అ భ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ క్యాటగిరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాధ్యతలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు (శాట్స్) అప్పగించారు.
మొత్తం 393 మంది అభ్యర్థులు సర్టి ఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వెరిఫికేషన్ తర్వాత సవ్యంగా తేలిన 33 మందికి తొ లుత ఉద్యోగాలిచ్చారు. మిగిలిన అరవైకి పై గా పోస్టులను స్పోర్ట్స్ కోటాయేతర అభ్యర్థులతో ఓపెన్ కోటాకు మళ్లించి భర్తీచేశారు. అ యితే స్పోర్ట్స్ కోటాలో నాలుగు ఫారాలుంటాయి.
ఫాం-1 ఇంటర్నేషనల్, ఫాం-2 నేష నల్, ఫాం-3 రాష్ట్రస్థాయి, ఫాం-4 అం తర్ జిల్లా, ఇంటర్ యూనివర్సిటీ, జిల్లా స్థా యి లో ఆటల్లో పాల్గొన్నవారికి ఇస్తారు. అ యితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియపై అ భ్యంతరాలు వ్యక్తంచేస్తూ పలువురు అభ్యర్థులు ఫిర్యాదుల మీద ఫిర్యాదుల చేయడం తో తొ లుత అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించగా, నవంబర్ 20, 21, 22 తేదీల్లో మరోసారి వెరిఫికేషన్ చేశారు.
అయితే, నవంబర్‌లో కింది స్థాయి అధికారులు (లోలెవల్ కమిటీ) ఈ సర్టిఫికెట్ వెరిఫి కేషన్‌ను నిర్వహించారని, మళ్లీ ఇ ప్పుడు జనవరి 3, 4 తేదీల్లో హైలెవల్ కమి టీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తుం ది. 393 మంది అభ్యర్థులకూ మళ్లీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీ లో అక్రమాలు జరిగాయన్న అనుమానాలను అభ్య ర్థులు వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుల వివరాలివి
హైదరాబాద్‌లో 12, నల్లగొండ, ఖమ్మంలో 7 చొప్పున, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డిలో 5 చొప్పున, నిజామాబాద్ 4, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, వికారాబాద్, భూపాలపల్లి 3 చొప్పున, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, జనగాం, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, ఆదిలాబాద్‌లో 2 చొప్పున, వనపర్తి, హనుమకొండ, కరీంనగర్, సిరిసిల్ల, గద్వాలల్లో ఒక్కో పోస్టు ఉన్నాయి.