న్యూఢిల్లీ: ఫిజీ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ చాంపియన్‌షిప్ జూనియర్ అండ్ సీనియర్ పోటీల్లో భారత వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ బాబు స్వర్ణం సాధించాడు. గురువారం జరిగిన పురుషుల 81 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో రికార్డు బరువు ఎత్తి పసిడి కొల్లగొట్టాడు. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలు కలిపి మొత్తంగా 326 కిలోల బరువు ఎత్తిన 19 ఏళ్ల అజయ బాబు రికార్డు స్థాయి ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఈ ప్రదర్శనతో 81 కేజీల జూనియర్ విభాగంలో బాబు కొత్త కామన్‌వెల్త్ రికార్డును సెట్ చేసినట్లయింది. ఇక పురుషుల 89 కిలోల కేటగిరీలో మిజోరాంకు చెందిన వెయిట్‌లిఫ్టర్ లాల్‌రూయట్‌ఫెలా 301 కేజీలు రజతం గెలవగా.. హృదానంద 299 కేజీలు ఎత్తి కాంస్యం సొంతం చేసుకున్నాడు.