calender_icon.png 9 January, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోనస్ షేర్లకు రికార్డు తేదీ అక్టోబర్ 28

17-10-2024 12:39:29 AM

ముంబై, అక్టోబర్ 16: రిలయన్స్ ఇండస్ట్రీస్ నెలరోజుల క్రితం ఏజీఎంలో ప్రకటించిన బోనస్ ఇష్యూకు తాజాగా రికార్డు తేదీని ప్రకటించింది.  షేర్‌హోల్డర్లకు ముందస్తు దీపావళి బహుమతిగా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంచనా ప్రకటించడం, ఆ తదుపరి బోనస్ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపిన సంగతి విదితమే. బోనస్ షేర్ల జారీకి షేర్‌హోల్డర్ల అర్హతను నిర్దేశించే రికార్డుతేదీని అక్టోబర్ 28గా (సోమవారం)  నిర్ణయించినట్టు బుధవారం రిలయన్స్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.   

ముందస్తు దీపావళి గిఫ్ట్‌గా ప్రకటించినందున,  అక్టోబర్ 14న జరిగిన బోర్డు సమావేశంలో రికార్డు తేదీపై నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు అంచనా వేసినప్పటికీ, ఆ రోజున ప్రకటించలేదు. సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరలాభం 5 శాతం తగ్గిన సంగతి తెలిసిందే.