calender_icon.png 13 April, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వ్యాప్తంగా మారుమోగిన ఆంజనేయ నామస్మరణ...

13-04-2025 12:00:57 AM

శ్రీ భక్తాంజనేయ విగ్రహ పునః ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే..

పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్.. 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జన్మోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఆంజనేయ సామి ఆలయాలు సామి వారి నామస్మరణతో మార్మోగాయి. బోథ్ మండలంలోని పట్నపూర్ గ్రామంలో హనుమాన్ జన్మోత్సవం రోజున నూతన శ్రీ భాక్తఆంజనేయ సామి ఆలయ ప్రారంభము, విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమము గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిరహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయ్యారు.

భాజా భజంత్రీలతో వేద పండితుల మంత్రోచ్ఛరణతో అత్యంత నియమ నిష్టలతో విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టారు. యజ్ఞం నిరహించారు. ఆదిలాబాద్ లోని పలు కాలనీలోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సామివారి పల్లకి సేవ కార్యక్రమం నిరహించారు. హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరిపారు. ఎమ్మెల్యే  సామివారి పల్లకి మోశారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగు రామన్న సైతం హనుమాన్ జన్మోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిరహించారు.