calender_icon.png 10 January, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా చావుకు కారణం ముఠా రేణుక

30-12-2024 02:44:30 AM

మాయమాటలతో వలలో వేసుకున్న ఎంఎస్ సీసీ రేణుక సహజీవనం చేస్తూ ఇల్లు కొనివ్వాలని ఒత్తిడి మనోవేదనకు గురై సూసైడ్ నోట్ రాసి సింగిల్ విండో డైరెక్టర్ ఆత్మహత్య  రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేటలో ఘటన 

కోనరావుపేట, డిసెంబర్ 29 : నా చావుకి ముఠా రేణుక, ఆమె తమ్ముడు ముఠా అశోక్ లు కారణమంటూ ఓ సింగిల్ విండో డైరెక్టర్ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ పల్లం సత్తయ్య (62) ఐకెపి లో సీసీగా పనిచేస్తున్న  ముఠా రేణుక వేధింపులు తాలలేక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.

ఎస్సు ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పల్లం సత్తయ్య సింగిల్ విండో డైరెక్టర్‌గా, వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలో ఐకెపి సీసీగా పనిచేసే రేణుక సత్తయ్యను వలలో వేసుకుంది. మండలంలో మంచి ప్రజాసేవకుడిగా పేరున్న పల్లం సత్తయ్య కు రేణుక  మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. తరచూ డబ్బులు,నగలు కోనివ్వాలని దాదాపు రూ .25 లక్షల వరకు లాగేసుకుంది.

అయిన తృప్తి చెందని రేణుక కరీంనగర్‌లో రూ.40 లక్షల ఇళ్లు కొనివ్వాలని నిత్యం వేధింపులకు పాల్పడింది.అంతేకాకుండా మనం సుఖంగా ఉండాలంటే తన భర్తనైనా,లేక సత్తయ్య భార్యనైన చంపెద్దామని సత్తయ్యపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ వ్యవహారం నచ్చక గత 4 నెలల నుండి సత్తయ్య రేణుకకు దూరమ య్యాడు.

ఈ క్రమంలో రేణుక తో పాటు ఆమె తమ్ముడు  అశోక్ సైతం కరీంనగర్ రావాలని లేదంటే చంపేస్తానని సత్తయ్యను  బెదిరించడం తో మనోవేధనకు  గురై సత్తయ్య సూసైడ్ నోట్ రాసి శనివారం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి భార్య మళ్లవ్వ, కుమారుడు మనోహర్, కూతురు దీపిక ఉన్నారు.

మృతుని భార్య ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సు ప్రశాంత్ రెడ్డి తెలిపారు.విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.అయితే సత్తయ్య మృతి మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన మృతి పట్ల ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావు, సింగిల్ విండో చైర్మన్లు బండ నరసయ్య, సంకినేని రామ్మోహన్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం వ్యక్తం  చేశారు.