పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసిన క్షతగాత్రుడు
- కబ్జా భూముల పరిశీలనకు రియల్టర్ల అనుచరులు ససేమిరా
- ఏకశిలానగర్‌లో ఎంపీని అడ్డుకున్న రియల్టర్లు
ఘట్‌కేసర్ జనవరి 21 (విజయక్రాంతి): కబ్జాకు గురైనవంటున్న ప్లాట్లను పరిశీలిం చి, బాధితులను పరామర్శించేందుకు వెళ్తు న్న ఎంపీ ఈటల రాజేందర్‌ను కొందరు రియల్టర్లు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఓ రియల్టర్ అనుచరుడిపై చేయిచేసుకున్నారు. ఈ ఘటన మేడ్చ ల్ జిల్లా ఘట్ కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో మంగళవారం చోటుచేసుకున్నది.
స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారానికి చెందిన ‘మునుకుంట్ల’ కుటుంబానికి కొర్రెముల గ్రామ రెవెన్యూ పరిధిలోని 739 నుంచి 749 సర్వేనెంబర్లలో భూమి ఉంది. యాజమానులు ఆ భూమిని 1985లో ఓ రియల్టర్‌కు విక్ర యించారు. ఆ భూమిని తిరిగి 1989లో మరో ఇద్దరు రియల్ వ్యాపారులు కొని వెంచర్లు వేశా రు. వాటిని కొందరు కొనుగోలు చేశారు.
ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో లోపాలు ఉన్నాయని గుర్తించిన మునుకుంట్ల కుటుంబానికి చెందిన కొందరు 2005లో రియల్టర్ వెంకటేశ్‌కు మళ్లీ విక్రయించారు. తర్వాత వెంకటేశ్ సదరు భూమి లో హద్దురాళ్లను తొలగించాడు. భూమిని వ్యవసాయా భూమిగా మార్చాడు. దీంతో అంతకు ముందు ప్లాట్లు కొన్న యజమానులు ఆందోళనకు దిగారు.
అయినప్పటికీ ప్రయోజనం లేకపో వడంతో బాధితులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి తమకు ప్లాట్లు ఇప్పించాలని కోరారు. దీంతో ఎంపీ మంగళవారం ఏకశీలనగర్‌కు చేరుకున్నారు. అనంతరం ఎంపీ బాధితులు కోల్పోయిన ప్లాట్లను చూసేందుకు వెళుతుండగా బిల్డర్ వెంకటేశ్ అనుచరుడు మహమ్మద్ రఫీక్‌తో పాటు కొందరు రియల్టర్లు ఎంపీని అడ్డుకున్నారు. మందలించినా వినకపోవడంతో ఎంపీ వారిలో మహమ్మద్ రఫీక్‌పై చేయిచేసుకున్నారు. ఘటనలో రఫీక్‌కు గాయాలయ్యాయి.
ఈ క్రమం లో అక్కడ తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ ఎస్.చక్రపాణి, పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజువర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మున్సిపాలిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గాయపడిన మహ్మద్ రఫీక్‌ను రియల్టర్ వెంకటేశ్ అనుచరులు హైద రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించి చికి త్స అందిస్తున్నారు.
రాష్ట్రంలో పేదలకు భద్రత కరువైంది: ఎంపీ ఈటల
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి రాష్ట్రంలో పేదలకు భద్రత లేకుండా పోయిందని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఏకశిలానగర్ ఉద్రిక్తత ఘటన తర్వాత ఎం పీ మీడియాతో మాట్లాడారు. పేదల పక్షాన నిలవాల్సిన పోలీసులు మోసగాళ్లకు సహ కరిస్తున్నారని ఆరోపించారు. పేదలు తమ స్థలా లు కోల్పోయి ఇబ్బంది పడుతుంటే, వారికి మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఏమా త్రం పట్టించుకోవడం లేదన్నారు.
అనంతరం ఎం పీ భూములు కబ్జా చేసిన రియల్టర్‌పై కఠిన చర్య లు తీసుకోవాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు కు కాల్ చేసి చెప్పారు. ఎంపీ వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి, పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డి తదితరులున్నారు.
ఎంపీ ఈటలపై ఫిర్యాదు
మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పా టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసో సియేషన్ అధ్యక్షుడు శివారెడ్డి అకారణంగా తమ పై దాడి చేసి గాయపరిచారని బిల్డర్ వెంకటేశ్ అనుచరులు మహమ్మద్ రఫీక్, గ్యార ఉపేందర్ అనే వ్యక్తులు మంగళవారం సాయంత్రం పోచా రం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.