calender_icon.png 4 October, 2024 | 5:02 PM

చిన్నారిని తిన్న ఎలుకలు

04-10-2024 01:25:01 AM

తండ్రికి 16 ఏళ్ల జైలు శిక్ష

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: అజాగ్రత్త, పట్టింపులేని తనంతో 6 నెలల చిన్నారిని ఎలుకలు కొరికి తిన్న కేసులో శిశువు తండ్రి డేవిడ్ స్కోనాబమ్‌కు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని ఇండియానా కోర్టు తీర్పునిచ్చింది. శిశువు సంరక్షణలో నిర్లక్ష్యం వహిం చిన శిశువు అత్తకు ప్రొబేషనరీ శిక్ష విధించింది. గతేడాదిజరిగిన ఈ ఘటనలో.. కుటు ంబసభ్యుల అజాగ్రత్త, నిర్లక్ష్యంతో 6 నెలల చిన్నారి ప్రాణాల మీదికి వచ్చింది.

అమెరికాలోని ఇండియానాకు చెందిన డేవిడ్, ఏంజెల్ దంపతులకు పుట్టిన మగశశివు(6 నెలలు).. ఇంట్లోని ఉయ్యాలలో ఉంచగా ఎలుకలు కరవడంతో ఒంటినిండా గాయాలయ్యాయి. వెంటనే శిశువును ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారి శరీరంపై దాదాపు 50కి పైగా గాయాలను  గుర్తించారు.

ప్రస్తుతం బాబు కోలుకున్నప్పటికీ భవిష్యత్‌లో ఆ చిన్నారికి శాశ్వత వైకల్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు పూర్తి ఆధారాలు సమర్పించగా.. ఈ చిన్నారి తండ్రికి 16 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇదే కేసులో కోర్టు.. చిన్నారి తల్లి, నానమ్మకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.