calender_icon.png 23 October, 2024 | 6:56 AM

రేటు తగ్గరు.. బిల్లు ఇవ్వరు

18-09-2024 03:17:14 AM

  1. సూర్యాపేటలో మొబైల్ స్పేర్ పార్ట్స్ దందా 
  2. కోట్లలో వ్యాపారం.. నాణ్యతలో శూన్యం 
  3. అమ్మకాల్లో రాజస్థానీలదే హవా 
  4. రెండొందల దుకాణాలకు అమ్మేది నలుగురే

సూర్యాపేట, సెప్టెంబర్ 17: మార్కెట్‌లో ఉన్న ఏ మొబైల్ కంపెనీకి సంబంధించి స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన రషీదు పొందడం చట్టపరంగా ప్రజల హక్కు. వ్యాపారస్థులు కూడా అమ్మిన వస్తువులకు రషీదు ఇవ్వాలి. కానీ సూర్యాపేటలో కొంతమంది వ్యాపారులు వారు అమ్మిన వస్తువులకు ఎటువంటి బిల్లులు ఇవ్వడం లేదు. అంతే కాకుండా నాణ్యతా లోపం ఉ న్న వస్తువులను అమ్ముతూ జనాలను మో సం చేస్తున్నారు. వ్యాపారస్తులు ఏ వస్తువు అమ్మినా, కొన్నా చట్ట పరంగా ప్రభుత్వానికి పన్ను రూపంలో డబ్బును చెల్లించాల్సి ఉం టుంది. అయితే కొందరు వ్యాపారులు అక్ర మ విధానాలను అనుసరిస్తూ ఆ డబ్బులు ఎగ్గొట్టి జీరో వ్యాపారం నిర్వహిస్తున్నారు. 

అమ్మకాల్లో రాజస్థానీల రాజసం

మొబైల్‌పోన్ విడిభాగాల అమ్మకాల్లో రాజస్థానీల రాజసం ఉట్టిపడుతుంది. ఇక్కడ ఉన్న నాలుగు విడిభాగాల అమ్మకపు దుకాణదారులు రాజస్థాన్‌కు చెందిన వారు కావడం గమనార్హం. వీరంతా సిండికేట్ అయ్యి వినియోగదారులకు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు ఆ విడిభాగాలను అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు.  స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండతోనే వారు అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

జోరుగా సాగుతున్న జీరో దందా 

జీరో దందాతో నాణ్యతలేని వస్తువుల ను అమ్ముతూ ఒక వైపు ప్రభుత్వాన్ని, మరోవైపు వినియోగదారులను మోసం చేస్తూ కోట్ల రూపాలను దోచుకుంటున్నా రు.  సూర్యాపేట పట్టణంలో సుమారు రెండొందలకు పైగా మొబైల్ షాప్‌లు ఉ న్నాయి. వీటిలో దా దాపుగా అన్నిచోట్ల మొబైల్ రిపేరింగ్ కూడా చేస్తుంటారు. ఇన్ని షాప్‌లకు అవసరమైన మొబైల్ స్పేర్ పార్ట్స్ మాత్రం కేవలం నాలుగంటే నా లుగు షాప్‌లలో మాత్రమే దొరుకుతా యి. అవి రామలింగేశ్వరస్వామి దేవాల యం రోడ్డు, మెన్స్‌క్లబ్,  రెడ్‌బకెట్, బ్లూ సీల సమీపంలో ఉన్న షాప్‌ల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది.

ఇక్కడ కొనుగోలు చేసిన వస్తువులకు ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా జీరో దందాను జో రుగా కొనసాగిస్తున్నారు. దీంతో సుమా రు రెండొందల షాప్‌ల వారు బిల్లులు ఇ వ్వకున్నా వారు చెప్పిన రేటుకు వినియోగదారులు అక్కడే కొంటున్నారు. విడిభా గాలకు ఎటువంటి వారంటీ, గ్యారంటీలు ఉండవు. ఈ విషయాన్ని మొబైల్ రిపేరి ంగ్ చేసేవారు వినియోగదారులకు చెప్పి నపటికి గత్యంతరం లేక రిపేర్ చేయిం చుకుంటున్నారు. నాణ్యతలేని వస్తువుల కారణంగా నెల గడవక ముందే మళ్లీ రిపేర్‌కు రావడం పరిపాటిగా మారింది.