calender_icon.png 1 November, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడాలి

02-08-2024 10:29:11 AM

సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం అందాలి

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం కొనసాగుతున్నాయి. శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు సివిల్ కోర్టుల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్ష పడాలన్నారు. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలని కోరారు. కొన్ని విషయాల్లో అందరూ కలిసి పనిచేయాలని కేటీఆర్ తెలిపారు. అత్యాచారాలు, సైబర్ క్రైమ్ పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం అందాలన్నారు. సైబర్ క్రైమ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలన్నారు. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిదికాదని కేటీఆర్ వెల్లడించారు.