25-02-2025 11:44:05 PM
ఫ్రాన్స్‌లో 74 ఏళ్ల సర్జన్ జోయెల్ లి ఘాతుకం..
వెలుగులోకి 3 లక్షలకు పైగా ఫోటోలు, 650కి పైగా అశ్లీల వీడీయోలు..
పారిస్: పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి విచక్షణ మరిచి 299 మందిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని బ్రిటానీ ప్రాంతానికి చెందిన జోయెల్ లి స్కౌర్నెక్ ఒక ఆసుపత్రిలో సర్జన్‌గా విధులు నిర్వర్తించేవాడు. మూడు దశాబ్దాల సర్వీసులో తన వద్దకు వచ్చే రోగులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడేవాడు. అలా దాదాపు అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా దాదాపు 299 మందికి పైగా వ్యక్తులపై పాశవికంగా ప్రవర్తించాడు. వీరిలో చాలా మంచి చిన్నారులే కావడం మరింత విచారకరం. ఎప్పటినుంచి ఈ దారుణాలకు పాల్పడుతున్నప్పటికీ జోయెల్ క్రూరత్వం 2017లో బయటికి వచ్చింది.
తన పొరుగింట్లో ఉన్న ఒక ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంపై ఆయనపై కేసు నమోదైంది. కేసు నిమిత్తం పోలీసులు జోయెల్ ఇంట్లో సోదాలు నిర్వహించగా దాదాపు 3 లక్షలకు పైగా ఫోటోలు, 650కి పైగా అశ్లీల వీడియోలు వెలుగులోకి రావడం గమనార్హం. చిన్నారులు, జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అతడి డైరీ ద్వారా గుర్తించారు. ఈ సంఘటన అనంతరం కూడా మరో నలుగురిపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలడంతో 2020లో కోర్టు జోయెల్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. నాలుగు నెలలుగా కేసులో విచారణను మరింత ముమ్మరం చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు. వీరిలో చాలామంది చిన్నారులే ఉన్నట్లు పేర్కొన్నాడు. మానసిక ప్రవర్తనను గమనించిన కోర్టు జోయెల్‌కు మరో 20 ఏళ్ల జైలుశిక్ష లేదంటే చచ్చేంత వరకు జైలులో మగ్గేలా శిక్ష విధించే అవకాశముంది.