calender_icon.png 11 January, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునపై అత్యాచార కేసు కీలక మలుపు

07-11-2024 01:11:14 AM

అమరావతి, నవంబర్ 6 (విజయక్రాంతి): మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై దాఖలైన అత్యాచార కేసు మరో మలుపు తిరిగింది. అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసిన బాధితురాలు స్వయంగా ఏపీ హైకోర్టుకు హాజరై నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీసులు కేసు కొట్టివేస్తే తనకు అభ్యంతరం లేదని అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ బుధవారం విచారించారు. ఫిర్యాదుదారు అడగ్గానే కేసును కొట్టేయలేమని చెప్పారు.

తప్పుడు ఫిర్యాదు చేసినట్టు నిరూపణ అయితే ఫిర్యాదిదారుపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ప్రజాప్రతినిధి కాబట్టి కేసులపై విచారణ మూసివేత ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పారు. ఫిర్యాదు చేశాక కోర్టుకు వచ్చి వాపస్ తీసుకోవడం ఇటీవల జరుగుతోందని, దీని పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కేసు డైరీ, దర్యాప్తు స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

విచారణ ఈ నెల 12కి వాయిదా వేశారు. విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ మంత్రి నాగార్జునపై కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ నారార్జున, ఆయన పీఏ మురళీమోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణకు వచ్చిన సమయంలో బాధితురాలు పైవిధంగా చెప్పడంతో కేసు కీలక మలుపు తిరిగింది. 

నందిగం సురేశ్‌కు ఎదురుదెబ్బ

మరియమ్మ అనే మహిళ హత్య కేసు నిందితుడైన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కో ర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన మరియమ్మ రెండు వర్గాల మధ్య గొడవలో మరణించారు. ఆ ఘర్షణల వెనుక సురేశ్ హస్తం ఉందని ఆమె కుమారుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సురేశ్‌ను అరెస్టు చేశారు.