calender_icon.png 21 October, 2024 | 12:36 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్తా చాటాలి

20-10-2024 04:10:23 PM

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం

ప్రజలను తప్పుదోవ పట్టించడమే బిఆర్ఎస్ లక్ష్యం 

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలo మధు ముదిరాజ్

గజ్వేల్( విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం అయన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి ఖాల్సాలో డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డితో కలిసి శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  మీడియాతో ఆయన మాట్లాడారు. శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు, చల్లని చూపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషితో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా బిఆర్ఎస్, బిజెపి పార్టీలు కుట్రలు పన్నుతుండగా, ప్రజల సంపూర్ణ ఆశీస్సులు, వారి అండతో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక, సాహసోపేత నిర్ణయాలతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. ఆలాగే కాంగ్రెస్ పార్టీకి పటిష్ట నాయకత్వం ఉండగా, వారి అండతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి సర్పంచ్ మొదలు జెడ్పిటిసి, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీలను కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కష్టపడిన పార్టీ కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీరామ నర్సింలు ముదిరాజ్, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జెల్ల మల్లేశం ముదిరాజ్, మాజీ ఎంపీపీలు మోహన్, విద్యా కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గొడుగు జనార్ధన్, నాయకులు కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జింక మల్లేశం, ప్రవీణ్ గౌడ్, శివారెడ్డి, నర్సింహరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సాయి కిరణ్ గౌడ్, కొoడగళ్ల గణేష్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.