బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో బుధవారం కురిసిన వర్షం దీపావళి పండుగ సామాగ్రి అమ్ముకునే వ్యాపారులకు, టపాకాయల వ్యాపారులకు నష్టాన్ని చేకూర్చింది. గురువారం దీపావళి పండుగ సందర్భంగా ఉదయం నుంచే పట్టణంలో పువ్వులు, కేదారేశ్వర వ్రతాలకు సంబంధించిన పూజా సామాగ్రి అమ్మే వ్యాపారులతో రద్దీగా మారింది. ఒక్కసారిగా మధ్యాహ్నం వర్షం కురవడంతో వీరికి వ్యాపారాలు సాగని పరిస్థితి తలెత్తింది.