- గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
జగిత్యాల, ఆగస్టు 30 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు దంచి కొట్టడంతో వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వరానికి జగిత్యాల పట్టణంలోని గోవింద్‌పల్లె వాగు ఉప్పొంగింది. దీంతో వాగు అవతల ఉన్న వెంకటాద్రినగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరం ఉన్నవారిని జేసీబీ సాయంతో వాగు దాటించారు. వర్షం కురిసినప్పడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.