calender_icon.png 19 October, 2024 | 11:58 AM

వాన రందీ !

28-07-2024 03:21:21 AM

జయశంకర్ భూపాలపల్లి, జూలై 27(విజయక్రాంతి): భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వానలు తగ్గుముఖం పట్టలేదు. వారం రోజులుగా విస్తారంగా వానలు కురుస్తూనే ఉన్నాయి. వరద కారణంగా ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మేయిన్ రోడ్డులో పోతుల్వాయి వద్ద బొర్రవాగు, కేశవాపూర్ మద్య పెద్దవాగు, మహాముత్తారం వద్ద కోణంపేట అలుగువాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు ఎజేన్సీ మండలాల్లోని తదితర గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధి కారులు రెండో ప్రమాదహెచ్చరికను జారీ చేశారు. రామన్నగూడెం వద్ద గోదావరి ఉదృతిని ఎస్పీ శబరీష్ పరిశీలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరు గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.