calender_icon.png 20 March, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేడియాలజిస్ట్ నిరీక్షణకు తెర.!

20-03-2025 12:50:13 AM

  • ఆస్పత్రిలో అందుబాటులోకి రానున్న సిటీ స్కానింగ్ సేవలు
  • టీహబ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే రిపోర్టులు విజయక్రాంతి కథనానికి
  • ఫోన్ లైన్‌లో స్పందించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ మార్చి 19 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ వైద్యుడి కొరత కారణంగా సిటి స్కాన్ సేవలు అందక రోగులు పడుతున్న ఇబ్బందులకు తెరపడనుంది. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా కనీసం ఎక్స్రే అల్ట్రా సౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ అందుబాటులో లేకపోవడంతో జనరల్ ఆస్పత్రిగా ఉన్నప్పటికీ ప్రథమ చికిత్సకే పరిమితం అవుతోంది.

ప్రభుత్వం సిటీ స్కాన్ యంత్రాలు అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలు బిగించినప్పటికీ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ వైద్యుల కొరత కారణంగా ఈ యంత్రాలన్నీ అలంకారప్రాయంగానే మిగిలాయి. ఫలితంగా జిల్లాలోని పరిసర నియోజకవర్గాల ప్రజలతోపాటు జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయక్రాంతి రేడియాలజిస్ట్ రాక కోసం ఎదురుచూపులు అనే వార్త కథనాన్ని బుధవారం ప్రచురించింది.

దీంతో స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ నుండి ఫోన్ లైన్ ద్వారా విజయక్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. ఈ సమస్య గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించడం జరిగిందని హైదరాబాద్లో ఉన్న రేడియాలజిస్టు నేరుగా టీహబ్ ఆన్లైన్ ద్వారానే రిపోర్టర్లు అందించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులను శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా సిటీ స్కానింగ్ తీసి టీ హబ్ ద్వారా ఆన్లైన్ చేయడంతో గంటల వ్యవధిలోనే హైదరాబాద్లో ఉన్న రేడియాలజిస్టులు పరిశీలించి రిపోర్టర్లు పంపనున్నట్లు తెలిపారు. అందుకు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘుతో చర్చలు జరిపి ట్రయల్ రన్ కూడా జరిపినట్లు తెలిపారు.

దీంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రోగులతో పాటు గర్భిణీలకు ఇతర వ్యాధిగ్రస్తులకు ఈ సిటీ స్కానింగ్ సేవలు ఎంతో ఉపయోగపడనట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.