calender_icon.png 23 January, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిసిన దివ్య దేశ్‌ముఖ్

23-01-2025 12:00:00 AM

ఆమ్‌స్టర్‌డామ్: నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న 87వ టాటా స్టీల్ చెస్ టోర్నీలో చాలెంజర్స్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ తొలి విజయాన్ని అందుకుంది. నాలుగో రౌండ్‌లో దివ్య టర్కీకి చెందిన ఎడిజ్ గురెల్‌పై, ఆర్.వైశాలీ ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్‌బెక్‌పై విజయాలు సాధించారు. ఇక భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశాడు.

మాస్టర్స్ విభాగంలో బుధవారం జరిగిన నాలుగో రౌండ్‌లో ప్రజ్ఞానంద మన దేశానికే చెందిన లియోన్ మెండోన్కాపై 46 ఎత్తుల్లో విజయం సాధించాడు. మరో గేమ్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరిక్రిష్ణ నెదర్లాండ్స్ జీఎం మాక్స్ వర్మెర్‌డమ్‌పై గెలుపొంది రెండో విజయం అందుకున్నాడు. అర్జున్ ఇరిగేసి, గుకేశ్‌లు డ్రాతో సరిపెట్టుకున్నారు.