న్యూఢిల్లీ, ఆగస్టు 11: మెక్రికోలో ఇప్పుడు ఓ పిరమిడ్ అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది. శతాబ్దాల నాటి ఆ పిరమిడ్ కొంతభాగం కూలిపోవటంతో ఇక యుగాంతం సంభవించబోతున్నదని ప్రజలు భయపడిపోతున్నారు. మెక్రికోలోని మికోకన్ రాష్ట్రంలో ఇహౌస్‌జియో అనే పురావస్తు కేంద్రం ఉన్నది. అందులో పురెపెచా తెగవాళ్లు వందల ఏండ్ల క్రితం నిర్మించిన రెండు యకట పిరమిడ్లు ఉన్నాయి. వాటిని ఆ తెగ ప్రధాన దైవమైన కురిక్వెరికి మనుషులను బలి ఇచ్చేందుకు నిర్మించారు. ఇటీవల కురిసిన కుంభవృష్టికి అందులో ఒక పిరమిడ్ కొంతభాగం కూలిపోయింది. ఈ పిరమిడ్లు కూలటం యుగాంతానికి సంకేతమని తమ పూర్వీకులు చెప్పారని, ఇక జరుగబోయేది అదేనని పురెపెచా తెగవారు వణికిపోతున్నారు. ఈ తెగవారు అత్యంత బలమైన ఆజ్‌టెక్ తెగను ఓడించి ఈ ప్రాంతాన్ని 400 ఏండ్లు పాలించారు. వీరి అధికారాన్ని స్పానిష్ వలసవాదులు అంతంచేశారు.