15-04-2025 06:43:54 PM
మద్దతు ధర లభించక రైతులకు నష్టం..
కొనుగోళ్ళలో జాప్యంతో పాటు తక్కువ సేకరణ..
ఎకరాకు దిగుబడి 25 కింటాలు వస్తే కొనుగోలు 8 క్వింటాళ్ల 65 కిలోలు..
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): జొన్న పంట పండించిన రైతులకు అమ్ముకుందామంటే ప్రభుత్వం కొరివి పెడుతుంది.. జన కొనుగోలు కేంద్రాలను చేతికి వచ్చేవరకు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులు ప్రజాప్రతినిదులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో కామారెడ్డి జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన జొన్న పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో దళారులు రాజ్యమేలుతున్నారు. వారు అడిగిన ధరకే విక్ర హించుకుంటున్నారు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పంట కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దీంతో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ ఏడాది యాసంగిలో వేల ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేశారు.
జిల్లాలోని పిట్లం పెద్ద కొడప్గల్ గాంధారి తాడువాయి లింగంపేట్ నిజాంసాగర్ తదితర మండలాల్లో ఏట యాసంగిలో శనగ పంటను రైతులు అధికంగా చేస్తున్నారు. దాంతోపాటు మెట్ట భూముల్లో జొన్న పంటను రైతులు సాగు లాభదాయకంగా ఉండటంతో ఈ ఏడాది శనగ కంటే జొన్న పంట సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సాగునీటి కొరత ఇతర సమస్యలను ఎదిరించి రైతులు పంట తీశారు. యాసంగిలో రైతు సాగు చేసిన జొన్న లక్షల క్వింటాళ్ల వరకు ఉండటంతో మార్క్ ఫెడ్ అధికారులు కనీసం 15 క్వింటాళ్ల వరకు ఎకరానికి కొనుగోలు చేయాలని గత ఏడాది ప్రారంభంలో 9, క్వింటాళ్ల 60, కిలోలు కొనుగోలు చేయగా ఆఖరి సమయంలో 12, క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు.
ఈ ఏడాది ప్రభుత్వం కనీస ధర క్వింటాలుకు రూ, 3371 మద్దతు ధర తో ఎకరాకు 8, క్వింటాళ్ల 65, కేజీల వరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిశాక మిగిలిన పంటను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి భారీగా నష్టపోయే ప్రమాదముంది. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ, 2500 చొప్పున కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పంట కొనుగోలు విషయంలో నిబంధనలు విధించడం సరికాదని ప్రతి క్వింటాలుకు రూ 900 నష్టపోవాల్సి వస్తుందని రైతులను అంటున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు నష్టపోకుండా తమకు ఏదైనా పరిష్కార మార్గం చూపించాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకు 15 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేపట్టి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జొన్న పంట రైతులు వాపోతున్నారు.
రైతులు పండించిన జొన్న పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
బాదావత్ జయరాం - రైతు, పెద్ద కొడంగల్, కామారెడ్డి జిల్లా
రైతులకు సాగునీరు లేక మేటర్ భూముల్లో వేసంగిలో జొన్న పంటను వేసాము. క్వింటాలకు జొన్నలు 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎకరాకు 8 క్వింటాళ్ల 65 కిలోలు తీసుకుంటామని చెప్పడం వల్ల రైతు లు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు పండించిన జొన్నలకు మద్దతు పండించిన పంటను కొనుగోలు చేయాలి.
ప్రైవేట్ వ్యాపారులకు జొన్నలు విక్రయిస్తే క్వింటాలకు 900 నష్టపోతున్నాం
పరం సింగ్ -రైతు, పెద్ద కోడపుగల్, కామారెడ్డి జిల్లా
రైతులకు పండిన జొన్న పంటను పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు జొన్న పంట అమ్మితే 900 నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం గ్రహించి రైతులు నష్టపోకుండా మద్దతు ధరను చెల్లించి ఆదుకోవాలి.