calender_icon.png 28 April, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహిరంగసభను విజయవంతం చేయాలి

26-04-2025 12:00:00 AM

ఖమ్మం, ఏప్రిల్ 25( విజయక్రాంతి ):-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయశుద్ధితో, చిత్తశుద్ధితో గాంధేయమార్గంలో ఉద్యమం చేసి రాష్ట్ర ఏర్పాటును సాకా రం చేశారని, 24 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారని ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఆదివారం అనగా 27 ఏప్రిల్ న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని సూచించారు.

శుక్రవారం ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి తదితరులుతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.జిల్లాకు 30 వేలు రావాలని తమకు పైనుంచి ఆదేశాలు వస్తే ఇప్పటికే 40 వేల మంది బహిరంగ సభకు రావడానికి సిద్దమయ్యారని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు : సండ్ర

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బస్తాలు ఇందిరమ్మ కమిటీలకు అప్పగించారని, ధాన్యం కొనుగోళ్లలో కూడా రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు నడుపుతున్నారని, తప్పుడు పద్ధతుల్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.

జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లపై శ్రద్ధ వహించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం వరంగల్ లో జరుగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు.  మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వర రావు, బానోత్ చంద్రావతి, మాజీ డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, మాజీ ఖమ్మం రూరల్ జడ్పీటీసీ వర ప్రసాద్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, మక్బూల్, సీనియర్ నాయకులు, ఉద్యమ కారులు ఉప్పల వెంకటరమణ,

మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, మైనారిటీ నాయకులు తాజుద్దీన్, సీనియర్ నాయకులు, అడ్వకేట్ బిచ్చాల తిరుమలరావు, ఉద్యమకారులు లింగనబోయిన సతీష్, నాయకులు మంచా నాయక్, బానోత్ రవి, జమీల్ షేక్, ఉపేందర్ రెడ్డి, ముత్యాల వెంకటప్పారావు, సద్దాం షేక్ మరియు తదితరులు పాల్గొన్నారు.