ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి గీత కార్మికులకు కిట్ల పంపిణీ..
కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్థానిక సంస్థల ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. నియోజకవర్గంలోని కాగజ్నగర్, సిర్పూర్ లో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కీట్స్ లను సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గౌడ కులస్తులు క్షేమం కోరి కల్లు గీత కార్మికుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఇక నుంచి ఎవరూ చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. కాటమయ్య రక్షణ కవచం కిట్లో 6 పరికరాలున్నాయన్నారు. ఎమ్మెల్సీ అంతకు ముందు రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు తదితరులు ఉన్నారు.