11-04-2025 12:13:40 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : అందరికీ న్యాయం చేయాలని సంకల్పంతో ప్రజా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం, హన్వాడ మండలం, నాయినోని పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి, రైతులను రుణ విముక్తులను చేశామని ఆయన గుర్తు చేశారు. రైతుల నుంచి సేకరించిన సన్న వడ్లను బియ్యంగా మార్చి రేషన్ షాపుల్లో తిరిగి ప్రజలకే పంచడం మాకు ఆనందంగా ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు.
అనంతరం కల్వరి కొండపై సీసీ రోడ్డు, వాటర్ ట్యాంక్ నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, నాయకులు టంకర కృష్ణయ్య యాదవ్, గండీడ్ నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అచ్చెన్న, వేంకటాద్రి, రామకృష్ణ, నాయకులు నవనీత, తిరుపతయ్య, కేశవులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.